శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): జనప్రియ అపార్ట్‌మెంట్ బ్లాక్–8లో 13వ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు లడ్డూ ప్రసాదాల వేలం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. లడ్డూ ప్రసాదాల వేలంలో నాగమణి సత్యనారాయణ రూ.17,100 చెల్లించి తొలి లడ్డూను కైవసం చేసుకున్నారు. మణిదీపిక రూ.9,200కు రెండో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మూడో లడ్డూను పూర్వీక లాటరీ ద్వారా కైవసం చేసుకున్నారు.

లడ్డూ ప్రసాదాల వేలం అనంతరం బ్లాక్–8 గణేష్ ఉత్సవాలకు సహకరించిన దాతలను నిర్వాహకులు చిరు సత్కారాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్ కుమార్ జీఎస్‌కే, శేరిలింగంపల్లి జనరల్ సెక్రటరీ కిరణ్, సినీ ప్రముఖులు వడ్డి నాగ మహేష్, రాజశేఖర్, శుభోదయం సుబ్బారావు, సీరియల్ నటుడు బాలాజీతో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన బ్లాక్ ఓనర్స్, నివాసితులు, దాతలు, భక్తులందరికీ బ్లాక్–8 ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.






