మియాపూర్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. పలు మండపాల్లో ప్రత్యేక పూజలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మియాపూర్ విలేజ్, మియాపూర్ మీ-సేవా, వడ్డెర బస్తీ, రాచమల్ల కృష్ణ పటేల్ నివాస ప్రాంతం, మియాపూర్ యువశక్తి, వడ్డెర యువజన సంఘం, టీఎన్ నగర్, అవిగ్నా యూత్ అసోసియేషన్, సాయిరామ్ నగర్, ఎఫ్‌సీఐ కాలనీ, ఆర్‌బీఆర్ కాంప్లెక్స్, ఆర్‌బీఆర్ ఉత్సవ కమిటీ, ప్రజయ్ షెల్టర్స్, ఎంఏ నగర్, ప్రగతి ఎన్‌క్లేవ్, వినాయక యువజన సంఘం, జనప్రియ వెస్ట్ సిటీ, NYLA గేటెడ్ కమ్యూనిటీ, HMT, కృష్ణ సాయి అపార్ట్‌మెంట్, స్టాలిన్ నగర్, ఉత్సవ్ అసోసియేషన్, మదీనాగూడ హుడా కాలనీ, AB యూత్ అసోసియేషన్, శ్రీరంగాపురం కాలనీ, అరోబిందో కాలనీ, SR ఎస్టేట్స్ తదితర ప్రాంతాల్లోని మండపాలను వారు సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, భక్తులతో వారు ఆత్మీయంగా ముచ్చటించారు. పలుచోట్ల నిర్వాహకులు, యువత, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లోనూ వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంప్రదాయాలను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భక్తి, సేవ, ఐక్యతతో ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజల ఆహ్వానాలను స్వీకరిస్తూ, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here