న్యూ కాలనీలో ఘనంగా వినాయక చవితి పూజలు.. పాల్గొన్న రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మియాపూర్ డివిజన్ న్యూ కాలనీలోని శివాలయం వినాయక మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, స్థానికులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here