చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): విధి నిర్వహణ నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని వేముకుంటలో నివాసం ఉండే బి.దుర్గేష్ (35) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి యూనిఫాం వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ గాలించినా ఫలితం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






