ఆర్‌కేవై టీం ఆధ్వ‌ర్యంలో వ‌ల‌స కూలీల‌కు భోజ‌న విత‌ర‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఆర్‌కేవై టీం స‌భ్యులు, మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్ త‌న‌యుడు మార‌బోయిన సంజీవ్ కుమార్‌యాద‌వ్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా ఆదివారం వ‌ల‌స కూలీల‌కు భోజ‌న విత‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గ‌చ్చిబౌలి వ‌డ్డెర బ‌స్తీలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో బీహార్ ప్రాంతానికి చెందిన కూలీల‌కు టీం స‌భ్యులు భోజ‌నాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి కూలిపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నవ‌ల‌స కూలీల‌కు క‌రోనా కార‌ణంగా జీవ‌నోపాది క‌రువయ్యింద‌ని, ఎంతోమంది పూటగ‌డ‌వని స్థితిలో ఉన్నార‌ని తెలిపారు. బిజెపి నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్ ఆదేశాల‌తో కూలీల‌కు భోజ‌నాన్ని అంద‌జేసిన‌ట్లు వారు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీం స‌భ్యులు వినోద్‌యాద‌వ్‌, గ‌ణేష్ ముదిరాజ్‌, న‌ర‌సింహ‌, జాజిరావు రాము, చంద్ర‌మ‌సిరెడ్డి, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వ‌ల‌స కూలీల‌కు భోజ‌న పొట్లాల‌ను అంద‌జేస్తున్న ఆర్‌కేవై టీం స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here