నమస్తే శేరిలింగంపల్లి:భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరి పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకట్రమణ భార్య కస్కాని గంగ, పిల్లలు పవిత్ర, బేబీ ప్రణీతతో కలిసి గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య గంగ ఈ నెల 14న తన పిల్లలు పవిత్ర, బేబీ ప్రణీత తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త వెంకట్రమణ భార్య పిల్లల కోసం చుట్టుపక్కలా, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త వెంకట్రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళకు సంబంధించి ఏవైనా వివరాలు లభిస్తే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు, 7901125526 నంబర్ ను సంప్రదించవచ్చన్నారు.
