మియాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెట్రో పిల్లర్ నంబర్ 600 సమీపంలోని యూటర్న్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన విష్ణు బండారి (29) అక్టోబర్ 8న రాత్రి 12:10 గంటల సమయంలో ఎఫ్‌జెడ్‌ మోటార్‌సైకిల్‌ (TS10EM6615)పై కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వైపు వెళ్తున్నాడు. మెట్రో పిల్లర్ నంబర్ 600 వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో టీఎస్07యూకే4359 నంబర్ గల టిప్పర్ లారీ అత‌ని బైక్‌ను ఢీకొట్టింది.

టిప్పర్‌ను డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అధిక వేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదంలో విష్ణుకు తల, పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మియాపూర్‌లోని టీఎక్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి 1:25 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి భార్య పూజా బండారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1434/2026 నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here