శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన గూడా లావణ్య, గూడా శ్రీనివాస్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం ద్వారా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ఈ చేరికలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







