శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): జాకీ క్లాసిక్ ఆర్వీ రెసిడెన్సీలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో గణనాథుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. ఈ వేలంలో గణనాథుడి లడ్డూ రూ.1,15,001 ధర పలికింది. అదే కమ్యూనిటీకి చెందిన కె. రమ్య శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు వేలంపాటలో పోటీపడి లడ్డూను కైవసం చేసుకున్నారు. తమ కమ్యూనిటీలో తొలిసారిగా నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో గణనాథుడి లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతృప్తిగా ఉందని వారు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో జాకీ క్లాసిక్ ఆర్వీ రెసిడెన్సీ వాసులందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రమ్య శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.






