నమస్తే శేరిలింగంపల్లిః నిషేధిత పొగాకు వస్తువులను అక్రమంగా విక్రయిస్తున్ననలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం తారానగర్, శేరిలింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో నిషేధిత పోగాకు వస్తువులను పెద్ద మొత్తంలో విక్రయిస్తున్న విషయాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు మూడు దుకాణాలపై దాడులు చేశామన్నారు. చందానగర్, శేరిలింగంపల్లిలో అక్రమంగా విక్రయిస్తున్న సాయి భరత్, గుర్రపు శ్రీను, షేక్ అంజద్, దండు నితీష్ కుమార్ నుంచి రూ. 10 లక్షల విలువ గల సిగరెట్లు, గుట్కా, ఆర్ ఆర్ గోల్డ్ చైనీ, తదితర పొగాకు ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు. ఇంట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా, నిందితుడు నిషేధిత పొగాకు వస్తువులను అవసరమైన వినియోగదారులకు అక్రమంగా విక్రయించడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అలవాటు పడినట్లు విచారణలో తేలిందన్నారు.