నమస్తే శేరిలింగంపల్లిః ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన నీటి అవగాహన సదస్సులో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో నీటి అవసరాలు, వాటి ప్రాముఖ్యతను కార్పొరేటర్ వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టును కాపాడాలని, నీటిని వృథా చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ జై. శంకర్, జలమండలి అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సాయి చరిత, సునీత, ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, నాయకులు గంగాధర్ రావు, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, కె. రోజా ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.