నమస్తే శేరిలింగంపల్లి: దేశం కోసం యుక్త వయస్సులో ప్రాణాలర్పించేందుకు సిద్దమై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, అతని స్నేహితులు రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ప్రాణత్యాగం చేసిన రోజును దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరని శేరిలింగంపల్లి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇజ్జత్ నగర్ సిపిఐ కార్యాలయం వద్ద భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల 91వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంతో ప్రభావితమై స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. 23 ఏళ్ల వయసులో నడి యవ్వనంలో దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, ఆయన స్నేహితులు రాజ్ గురు, సుఖ్ దేవ్ ను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసిందన్నారు. వారి తెగువ, సాహసమే నేటి తరాలకూ చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. నారాయణ, ఎం. వెంకటేష్, కె. చింటూ కే శివ, టి.మల్లి, ఇషాక్, దేవయ్య, ఎస్ గురుమూర్తి, తిరుపతమ్మ, బాల బీర్ తదితరులు పాల్గొన్నారు.
