నమస్తే శేరిలింగంపల్లి: ఏటీఎంలో డబ్బులు తెస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చందానగర్ గౌతమి నగర్ లో నల్లబోతుల తిమ్మరాజు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. జనవరి 24 వ తేదీన ఏటీఎం లో డబ్బులు తీసుకువస్తానని తిమ్మరాజు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. గతంలోనూ ఇలానే ఇంట్లో చెప్పకుండా వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చాడని, ఈ నెల 24 న వెళ్లిన వ్యక్తి నాలుగైదు రోజులైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో భార్య నల్లబోతుల రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ ధరించి ఉండగా ఎత్తు 5.9 ఫీట్స్, నలుపు రంగు, తెలుగు, హిందీ భాషలు మాట్లాడుతాడని వివరించారు. ఆచూకీ తెలిసిన వారు 9490617118, 7901113092, 9490617100, 100, 27853911 నంబర్లను సంప్రదించాలని కోరారు.
