నమస్తే శేరిలింగంపల్లి: దుర్గం చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గం చెరువు నీటిలో ఓ మృతదేహం తేలుతున్నట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి తనిఖీ చేయగా మృతుని జేబులో మొబైల్ ఫోన్ దొరికింది. మొబైల్ ఫోన్ లో ఉన్న సమాచారం మేరకు విచారణ చేయగా మృతుని పేరు ఎండీ సాజిద్, వయస్సు సుమారు 25 సంవత్సరాలు, హసన్ నగర్ కు చెందిన వ్యక్తి అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

