రాజీవ్ గృహకల్పలోని సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తా – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో బిజెపి నాయకులు బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజీవ్ గృహకల్ప కాలనీలో సొంత నిధులతో చేపట్టనున్న యాదవ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ భూమిపూజ చేశారు. అనంతరం కాలనీలో పర్యటించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, చెత్తాచెదారంతో పూరుకుపోయిన రోడ్లు, శానిటేషన్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రవికుమార్ యాదవ్ అన్నారు. వారానికోసారైనా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టలేని దయనీయ పరిస్థితిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని అన్నారు. డంపింగ్ యార్డ్, వీధి దీపాలు లేక ఇక్కట్లకు గురవుతున్నారని వాపోయారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలను, బెల్టు షాపులను అధికారులు అడ్డుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కంచర్ల ఎల్లేష్, రమేష్, శ్రీనివాస్ నీలకంఠ రెడ్డి, చిట్టా రెడ్డి ప్రసాద్, అఖిల్, హరీష్, విజయ్ యాదవ్, మధు యాదవ్, నవీన్ యాదవ్, సుధాకర్, ఆనంద్, అరుణ, పుష్పలత, విజయలక్ష్మి, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో చేపట్టిన బస్తీబాటలో సమస్యలను పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here