శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, గోపీనగర్ లలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం పాదయాత్ర చేశారు. బస్తీలలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇళ్లలోకి మంచినీటి పైపులైన్ల ద్వారా సరఫరా అయ్యే నీరు మట్టి తో కలుషితంగా వస్తోందని వాపోయారు. సింగూరు జలాలు విడుదల చేశారని అందువల్ల మట్టి కలిసిన నీరు సరఫరా అవుతోందని మరో రెండు మూడు రోజుల్లో పుష్కలమైన నీరు సరిపడా సరఫరా కానుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. నీటి సరఫరాలో ఇక నుంచి అంతరాయం లేకుండా చూడాలని వాటర్ వర్క్స్ ఏజీఎం వెంకట్ రెడ్డి కి సూచించారు. విద్యుత్ లైట్లు లేక రాత్రుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు యాదాగౌడ్, నెహ్రూ నగర్ కాలనీ బస్తీ కమిటీ అధ్యక్షుడు గఫుర్, నాయకులు గోపాల్, ఎల్లదాస్, ప్రభాకర్, శ్రీశైలం, సైదులు యాదవ్, రంజిత్ తదితరులు ఉన్నారు.