శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపు నగర్ లో సోమవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. జలమండలి ఏజీఎం వెంకట్ రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించిన రాగం కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మురికి కాలువ శిథిలావస్థకు చేరి కూలిపోయిందని దీంతో మురికి నీరంతా రోడ్డుపైనే నిలిచి ఇబ్బందికరంగా మారిందని స్థానికులు కార్పొరేటర్‌కు వివరించారు. సమస్యలపై స్పందించిన రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ యూజీడీ పైపులైన్ నిర్మాణం చేపట్టేలా చూడాలని అధికారులకు సూచించారు. కాలనీలో ప్రజావసరాల నిమిత్తం మౌలిక వసతుల కల్పనకు పాటు పడుతున్నట్లు తెలిపారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు కేశవ రెడ్డి, థామోస్, ఆంజనేయులు, రమేష్, గోపాల్, ప్రభాకర్ తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.