ఎస్.వీ.ఎస్ అవాస అపార్ట్మెంట్ లో పర్యటించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

ఎస్‌వీఎస్ అపార్ట్మెంట్స్ వాసుల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే తెలంగాణ‌): చందాన‌గ‌ర్ డివిజన్ ప‌రిధిలోని ఎస్.వీ. ఎస్ అవాస అపార్ట్మెంట్ లో ఆదివారం స్థానిక కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి ప‌ర్య‌టించారు. అపార్ట్మెంట్ పక్కన ఉన్న నాలాకి రిటైనింగ్ వాల్ నిర్మించాలని, అన్నపూర్ణ ఎనక్లేవ్ ఎంట్రన్స్ రోడ్ సి.సి రోడ్ నిర్మించాలని, 2 విధి లైట్లు అమార్చలని అపార్ట్మెంట్ వాసులు కోరారు. కార్పొరేటర్ న‌వ‌త‌రెడ్డి స్పందిస్తూ ప్రతి శనివారం అపార్ట్మెంట్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఎస్.వీ. ఎస్ అవాస అపార్ట్మెంట్ లో పర్యటించడం జరిగినది అని, నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం గురించి అధికారులతో చర్చిస్తాను అని, 2 రోజుల్లో విధి లైట్లు అమరుస్తాం అని, అన్నపూర్ణ ఎనక్లేవ్ ఎంట్రన్స్ సి.సి రోడ్ సంక్షన్ అయినది అని, ఇంకా మునుముందు ఏ సమస్య ఉన్న తాము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. అదేవిధంగా ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో భాగంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా విషయంలో అపార్ట్మెంట్ వాసులు ఎవ్వరు కూడా భయబ్రాంతులకు గురికావద్దు అని, కారోనా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు, కానీ తగుజాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంద‌ని, కరోనా కు మనో దైర్యమే మందు అని, భయపడి దాని ఆయుష్షు పెంచవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు,అపార్ట్మెంట్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌వీఎస్ అవాసా అపార్ట్మెంట్స్ వాసుల‌తో క‌ల‌సి వారి ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటుతున్న కార్పొరేట‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here