మియాపూర్ (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా మియాపూర్‌కు చెందిన డాక్టర్ మర్రపు గంగాధర్ రావు నియామకం అయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములుతో కలసి గౌరవ సలహాదారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వారి నివాసంలో గంగాధర్‌రావుకు ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతు కేసీఆర్ గారి బాటలో నడుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ, వారి సంక్షేమo కోసం, హక్కుల కోసం పని చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఎంపీ రంజిత్ రెడ్డి, సంఘం అధ్యక్షుడు గంధం రాములుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్, విద్యాశాఖ అధ్యక్ష కార్యదర్శి లు ప్రో.పీవై రమేష్, కోరం రవీందర్, కోలా శ్రీనివాస్, నూతనగంటి పురుషోత్తం, నారాయణ పవర్, రంజిత్ అన్న యువజన విభాగం అధ్యక్షుడు ఆశీల శివ కుమార్, టీపీయూఎస్ శేరిలింగంపల్లి అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్, హరీష్, లోకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.