కమ్యూనిటీ హాళ్లను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలి

  • అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి : కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి ప్రజలకు  అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన కాలనీ, శంకర్ నగర్ ఫేస్ 1, శంకర్ నగర్ ఫేస్ 2 , న్యూ శంకర్ నగర్ కాలనీ లలో ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ (ఎస్డీ ఫండ్స్ ) తో రూ. 70 లక్షల అంచనావ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనాలను నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు.

కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని, మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధమని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేసిన కార్యక్రమ వివరాలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన కాలనీ లో రూ .20 లక్షలతో, శంకర్ నగర్ ఫేస్ -1, కాలనీ లో రూ .15 లక్షలతో, శంకర్ నగర్ ఫేస్ -2, కాలనీలో రూ .15 లక్షలతో, న్యూ శంకర్ నగర్ కాలనీ లో రూ .20 లక్షల అంచనావ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పులిపాటి నాగరాజు, ప్రసాద్ , ఓ. వెంకటేష్, పారునంది శ్రీకాంత్, నరేందర్ బల్లా, యశ్వంత్, సందీప్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here