- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. లక్ష్మీ గణపతి దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖులు
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని లక్ష్మీ గణపతి దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పది వసంతాలు పూర్తిచేసుకుని 11వ వసంతంలోకి పయనిస్తున్న శుభ తరుణంలో శిల్పా ఎంక్లేవ్ సెక్రటరీ జయ కుమార్, ప్రెసిడెంట్ ప్రసాద్, సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ 327 ఐ ఎన్టియుసి కే. వెంకటేశ్వర్లు బుక్క భాస్కర్, మహేందర్ లు పవిత్రమైన బ్రహ్మ కమలం, సింహాచలం సంపంగి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో ఉష్ణోగ్రత తగ్గాలంటే మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.