శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తక్షణమే యాదవ సమాజానికి, ఈశ్వరమ్మ యాదవ్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా శివచరణ్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కోరారు. ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, లేనిపక్షంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఎల్బీనగర్లో ఈశ్వరమ్మ యాదవ్‌ను కలిసి బేరి రామచంద్ర యాదవ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆమెకు పూర్తి స్థాయిలో తమ మద్దతు ప్రకటిస్తూ, యాదవ సమాజం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, నాగర్‌కర్నూల్ యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు లాలూ యాదవ్, రాష్ట్ర యాదవ సంఘం నాయకుడు జగదీష్ యాదవ్, బీసీ నాయకులు అందెల కుమార్ యాదవ్, వావిలాల కృష్ణ యాదవ్, మెదక్ జిల్లా బీసీ నాయకుడు రాజు గౌడ్, వడ్డెర సంఘం నాయకుడు కిషోర్, పద్మశాలి సంఘం నాయకుడు కిషన్, ముదిరాజ్ సంఘం నాయకుడు రాఘవేందర్, మున్నూరు కాపు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు, ముద్దంగుల బాలరాజ్, యాదాద్రి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు బొజ్జ స్వామి, యాదవ్ సంఘం నాయకులు శ్రీశైలం యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సాయిలు, అశోక్‌తోపాటు యాదవ, కురుమ, ఇతర బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.





