మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని త్రివేణి విద్యాసంస్థలలో పనిచేస్తున్న పాఠశాలల ఇంచార్జ్ లు, కో-ఆర్డినేటర్లు చిలుకూరు బాలాజి దేవాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నట్లు విద్యాసంస్థల ప్రతినిధులు ఓ ప్రకటనలతో తెలిపారు. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు విద్యాసంస్థల మొదటి శాఖ మదీనాగూడ పాఠశాల నుండి చిలుకూరుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే గురువారం పాఠశాలల ఇంచార్జ్‌లు, కో-ఆర్డినేటర్లంతా బాలాజీ దేవాలయానికి పాదయాత్రగా వెళ్లి, అక్కడ గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని పరమేశ్వరున్ని ప్రార్థిస్తామని తెలిపారు.