శేరిలింగంపల్లిలో జోరుగా టిఆర్ఎస్ నాయ‌కుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రచారం

  • సుర‌భి వాణిదేవిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవ‌డం మ‌న బాధ్య‌త‌: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉమ్మ‌డి హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థి సుర‌భివాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ అన్నారు. బుధ‌వారం ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవితో క‌లిసి కొండాపూర్‌లోని బొటానిక‌ల్ గార్డెన్స్ వ‌ద్ద నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాక‌ర్స్‌ను క‌లిసిన నాయ‌కులు టిఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలపాల‌ని కోరారు.

బొటానిక‌ల్ గార్డెన్ వ‌ద్ద ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవి

ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ద‌క్షిణ భారత దేశం నుండి ఎన్నికైన తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ వాసి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి దివంగ‌త మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు కుమార్తె సురభి వాణి దేవిని ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కే విప్లవ్ కుమార్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రమేష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, వి జగదీష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస్ రావు, మంజుల రఘునాథ్ రెడ్డి, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కోమిరిశెట్టి సాయిబాబ, నీలం రవీందర్ ముదిరాజ్, రంగారావు గారు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్, కొండాపూర్ డివిజన్ సెక్రటరీ జె బలరాం యాదవ్, కొండాపూర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా , రక్తపు జంగంగౌడ్, నరసింహ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

  • చందాన‌గ‌ర్‌లో…
గిరిజ మార్వెల్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఫ్రెండ్స్ కాల‌నీ, గిరిజ మార్వెల్ అపార్ట్‌మెంట్ లో బుధ‌వారం ప్ర‌భుత్వ విప్ గాంధీ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. అసోసియేష‌న్ వాసుల‌తో బుధ‌వారం స‌మావేశమైన ఆరెక‌పుడి గాంధీ ‌హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి మెద‌టి ప్రాధాన్య‌త ఓటు వేయాల‌ని అపార్ట్‌మెంట్ వాసుల‌ను కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గుడ్ల ధనలక్ష్మి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…
సుర‌భివాణిదేవిని స‌త్క‌రిస్తున్న ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాల ప్ర‌తినిధులు

గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ఎస్ఎన్ గార్డెన్‌లో నిర్వ‌హించిన శేరిలింగంప‌ల్లి మండ‌ల ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యం ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్సీ ఆరెక‌పూడి గాంధీ ఆత్మీయ స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తెరాస పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి, టియుఎఫ్ఐడిసి ఛైర్మెన్ విప్లవ్ కుమార్, నాయ‌కులు వాసాల రమేష్ ల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థికి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

  • జ‌న‌ప్రియ అపార్ట్మెంట్స్‌లో కార్పొరేట‌ర్ పూజిత‌జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ ప్ర‌చారం…
జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్న కార్పొరేట‌ర్ పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పూజిత జ‌గ‌దీశ్వర్‌గౌడ్ బుధ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్స్‌, న‌గ‌ర్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్ల‌ను క‌లిసిన ఆమె టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి, శాంతయ్య, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్, విజయ్, రవి, మస్తాన్, చిన్నబాబు, శివాజీ, జితేందర్ రెడ్డి, అశోక్, కిష్టయ్య, కొండల్ రావు, సత్యనారాయణ, వెంకట్ సుబయ్య, సుధాకర్, సిరాజుద్దీన్, మహిళలు జ్యోతి రెడ్డి, రమ్య, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.

  • ప్ర‌జ‌య్ సిటీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో టిఆర్ఎస్ నాయ‌కులు
ప్ర‌జ‌య్‌సిటీలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్న టిఆర్ఎస్ నాయ‌కులు

హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌జ‌య్‌సిటీలో స్థానిక నాయ‌కులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప‌ట్ట‌భ‌ద్రుల‌ను క‌లిసిన నాయ‌కులు టిఆర్ఎస్ పార్టీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవికి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో శేఖర్ రెడ్డి, నాయుడు, వెంకట్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here