చైల్డ్‌ఫండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సేవ‌లు ఆద‌ర్శ‌నీయం: కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: పేద విద్యార్థుల చ‌దువుల కోసం సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న చైల్డ్‌ఫండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సేవ‌లు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్ అన్నారు. శ‌నివారం సుర‌భికాల‌నీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చైల్డ్‌ఫండ్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన స్కూట్ బ్యాగులు, నోట్‌బుక్స్‌, వాట‌ర్‌బాటిళ్లు, శానిటేష‌న్ కిట్లను రాగంనాగేంద‌ర్‌యాద‌వ్ చేతుల‌మీదుగా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాగం మాట్లాడుతూ పేద విద్యార్థుల‌కు చేయూత‌నందించాల‌నే ఉద్దేశంతో చైల్డ్‌ఫండ్ సంస్థ చేస్తున్న కార్య‌క్ర‌మాలు ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ పేద విద్యార్థుల‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సభ్యురాలు దివ్య, స్కూల్ మెంబర్ కమిటీ చైర్మన్ బస్వరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ రావు, ఇంఛార్చ్ ప్రిన్సిపాల్ దేవదాసు, తెరాస నాయకులు సభియా, జయ,గోపాల్ యాదవ్, కొయ్యాడా లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల‌కు కిట్ల‌ను అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here