ప్ర‌జా సంక్షేమ‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్యం: ఆరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమ‌మే టిఆర్ఎస్ ప్ర‌భుత్వ ధ్యేయమ‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. శ‌నివారం కొండాపూర్ డివిజ‌న్ ప్రేమ్‌న‌గ‌ర్‌కు చెందిన శ్రీ‌నివాసరెడ్డి ఆసుప‌త్రి బిల్లుల ప‌రిహారార్ధం ముఖ్య‌మంత్రి స‌హాయనిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును గాంధీ బాదిత కుటుంబానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుదని తెలిపారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత అప్పులు చేసి చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, నాయి నేని చంద్రకాంత్ రావు, అల్లం మహేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాదిత కుటుంబ స‌భ్యుల‌కు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్‌గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here