
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన కాలనీలు, అపార్ట్మెంట్లలో చేపట్టిన సహాయక పనులను స్థానిక కార్పొరేటర్ నవతారెడ్డి శనివారం పరిశీలించారు. సాయి రాఘవ అపార్ట్మెంట్, సత్యనారాయణ ఎన్క్లేవ్, వేమనరెడ్డి కాలనీలో పర్యటించి వరద నీరు వలన రోడ్లుపై పేరుకుపోయిన బురద, మట్టిని తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద వలన వచ్చిన బురద, మట్టి వలన వాహనదారులు పడిపోవడం, బాటసారులకు ఇబ్బంది కలుగుతుందంని తెలిపారు. వెంటనే వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు.





