గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): ఇంజినీరింగ్ కళాశాలల ప్రొఫెసర్స్ అసోసియేషన్ (టెక్ఫా) నూతన డైరీని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోన మహమ్మారి వల్ల ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబ పోషణ భారమైందన్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బందులు తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు. కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు సగం జీతాలైనా చెల్లించాలని కళాశాల యజమాన్యాలను ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, టిపియుస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మర్రాపు గంగాధర్,హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, టిపియుఎస్ నాయకులు కంది జ్ఞానేశ్వర్, వేముల భాస్కర్, మోహన్ నాయక్ నర్సింగ్ రావు శ్రావణి రెడ్డి, పద్మావతి కళావతి ఉమా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.