ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వినతిపత్రం అందించిన గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై వినతిపత్రం సమర్పించారు.
పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను వేయాలని వినతి పత్రంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. గోకుల్ ప్లాట్స్ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, పూర్ణ, గోవింద్, శ్యామ్ కుమార్, శ్రీనివాస్, రోజా రమణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.