నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన గుడిపూడి వెంకటరావు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 1లక్ష 50 వేలు మంజూరయ్యాయి.
ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాని బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు. వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.