
– దుర్గం చెరువులో బోటింగ్ ను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గం చెరువుకు విచ్చేసే పర్యాటకులకు మరో వినోదం దక్కనుంది. ఇకపై చెరువు నీటిలో ప్రయాణిస్తూ కేబుల్ బ్రిడ్జీ అందాలను ఆస్వాదించవచ్చు. మాదాపూర్ దుర్గం చెరువులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్‌లతో కలిసి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలు మంగళవారం ప్రారంభించారు.

అనంతరం అతిథులు అందరు కలసి బోటులో విహరించారు. దుర్గం చెరువుకు వచ్చే పర్యాటలకులకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం MD మనోహర్, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, చాంద్ పాషా, రమేష్, భాస్కర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నరేష్, రూప రెడ్డి, గౌరీ, నిర్మల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
