- పనిచేసిన వారికి ఫలితం దక్కడం లేదని ఆవేదన
నమస్తే శేరిలింగంపల్లి: పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన ఫలితం లేకపోవడం బాధాకరమని ఆవేదన రాగిరి సాయిరాం గౌడ్ వ్యక్తం చేశారు. పార్టీ కోసం అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి జైలులో శిక్ష అనుభవించిన బీజేవైఎం కార్యకర్తలకు నేడు అన్యాయం జరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడం, కనీసం తమ బీజేవైఎం అధ్యక్షులు భాను ప్రకాష్ కి కూడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ కార్యకర్తలకు మొండి చేయి చూపుతున్నారని, అందుకే సంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఇంచార్జి, రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా ఉన్న తాను ఆ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.