- బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీ వర్గాలకు భేరి రామచందర్ యాదవ్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో బీసీల రాజ్యాధికారం రావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు కులమతాలకతీతంగా ఓటు వేసి బీసీ నాయకులను గెలిపించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రవర్ణాల రాజకీయ నాయకులు, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి బీసీ నాయకులను గెలిపిస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. బీసీలకు ఓటు వేసుకో – బీసీ రాజాధికారం తెచ్చుకో – మీ తలరాత నువ్వే మార్చుకో అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, స్టూడెంట్ జెసి చైర్మన్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్, మియాపూర్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు సరోజినమ్మ, శ్రీనివాస్, కృష్ణ యాదవ్, రాజు గౌడ్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.