నమస్తే శేరిలింగంపల్లి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు ఉరిటి వెంకట్రావు ప్రజాపతి తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత, ఎంతో దూరదృష్టి కలిగిన మహోన్నత నేతకు బలవంతంగా అవినీతి మరక రుద్దడం సరికాదని అన్నారు. రాజకీయ కుతంత్రంలో భాగంగానే అక్రమంగ అరెస్ట్ చేశారన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రజాకర్షక నేతకు నిరాధార ఆరోపణలతో అవినీతిని అంటగట్టడం అనైతికమని అన్నారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని పార్టీల నేతలు బాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఏదేమైనా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.