ఆర్యవైశ్య సంఘం సామూహిక భవనం ప్రారంభం

  • -ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ఆర్యవైశ్య సంఘం వారు సంఘ సమావేశాలు, శుభకార్యాలు, జరుపుకోవాటనికి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భిక్షపతి యాదవ్ ఆర్యవైశ్య సంఘ స్థలం గురించి, భవనానికి కావాల్సిన మౌలిక వసతులను, రోడ్ల మరమ్మతుకు ఎంతగానో తోడ్పాటు అందించారని తెలుపుతూ ఎల్లమ్మబండలో వైశ్య సంఘం, సంఘ సభ్యుల ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని నిర్మించడం అభినందించవలసిన విషయమని పేర్కొన్నారు.

వైశ్య సంఘం నీతి, నిజాయితీతో వ్యాపారాలు చేస్తారని, వారు నివసిస్తున్న ప్రదేశాలలో లక్ష్మీ దేవత సంచరిస్తుందని, సంఘం వారి పేరు ప్రతిష్టలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున ఎప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని, సంఘానికి సంబంధించిన సమస్యలపై అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు సంఘ వ్యవస్థాపకులు పుల్లయ్య గుప్తా, అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, జె. శ్రీనివాస్ గుప్తా, కొండలరావు గుప్తా, ప్రవీణ్ గుప్తా, జి. శ్రీనివాస్ గుప్తా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్, సందీప్ గౌడ్, చాంద్, సురేష్, రాజు, హరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here