తెలంగాణ రాష్ట్రంలో అర్హులంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆర్థిక పురోభివృద్ధి కొర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో సంక్షేమ ఫ‌లాలు అర్హులంద‌రికీ అందించేందుకు టిఆర్ఎస్ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డ్ ఆర్థిక సహాయం తో జిహెచ్ఎంసి ప‌రిధిలోని నిరుద్యోగులకు, స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు అందజేస్తున్న సంచార మత్స్య విక్రయ మొబైల్ వాహ‌నాన్ని హఫీజ్పెట్ డివిజన్ కు చెందిన వెంకటేష్ మంజూరు కాగా గురువారం గాంధీ ల‌బ్దిదారుడికి అంద‌జేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా చేపల విక్రయం తో కుటుంబాలకు జీవనోపాధి క‌లుగుతుంద‌ని, ఈ వాహనాల లోపల ఫ్రిజ్, వాటర్ ట్యాంక్, చేపలు కట్ చేసే యంత్రాలు ఉంటయ‌ని, వీటి ద్వారా కాలనీ లలో చేపలను అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయ‌ని తెలిపారు. ఉదయం చేపలు విక్ర‌యించ‌డంతో పాటు సాయంత్రం చేప‌ల వంట‌కాల‌ను త‌యారు చేసేందుకు సైతం ఈ వాహ‌నాలు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. 60 శాతం స‌బ్సిడీ, 40 శాతం బ్యాంకు రుణం ద్వారా ఈ వాహ‌నాల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు విద్యాసాగర్, బ్రిక్ శ్రీను,కాశినాథ్ యాదవ్,విద్యాసాగర్, పద్మ, సుధా, అంజలి తదితరులు పాల్గొన్నారు.


ల‌బ్దిదారుడు వెంక‌టేశ్‌కు వాహ‌నాన్ని అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here