నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. 21వ తేదీన ఉదయం 6:30 గంటలకు దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తెలుతూ కనిపించింది. వ్యక్తి వివరాలు తెలియలేదు. నలుపు రంగు ప్యాంట్ దరించి ఉన్నాడని, ఎడమ చేతిపై స్టార్ గుర్తు టాటో ఉందని, కుడి చేతిపై పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తుపట్టినట్లైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని (94906 17182) లేదా I.O దీక్షిత WSI # 8712663119 నంబర్ కి కాల్ చేయాలనీ సూచించారు.






