- ఉచితంగా వైద్య పరీక్షలు చేయించిన మాజీ కార్పొరేటర్, ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ వేముకుంట నివాసి అబ్దుల్ సమదే కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డీ వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి అన్ని వైద్య పరీక్షలు చేయించారు. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీ. శివకుమార్ వర్మ, గౌస్, చందర్ రావు పాల్గొన్నారు.