నమస్తే శేరిలింగంపల్లి: సంగారెడ్డి లో ఎస్పిడిసిఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన సమక్షంలో 327 యూనియన్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై సైబర్ సిటీ సర్కిల్ ఇబ్రహీంబాగ్ డివిజన్ 1104 యూనియన్ నాయకులు 327 యూనియన్ లో చేరారు. వారిలో సయ్యద్ హుస్సేన్, విజయ్ కుమార్, రామరాజు, రమేష్, కిషన్, శివ ప్రసాద్, శివ శంకర్ ఎస్ కె రఫీ, మణికంఠ రెడ్డి ఉన్నారు.
