- మాట నిలబెట్టుకున్న ఎంపీ డాక్టర్. జి.రంజిత్ రెడ్డి.
- 2.4 లక్షల ఆర్థిక సాయంతో వంద మంది విద్యార్థులకు ట్రైన్ పాసులు

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. మర్పల్లి వాసుల కోరిక ఫలించింది. చేవెళ్ల ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలతో మర్పల్లిలో ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు.. 2020లో మర్పల్లి రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ సేవల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించారు. అనంతరం ఈ నెల 2 న సికింద్రబాద్ లోని రైల్ భవన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు. స్పందించిన జీఎం ట్రైన్ సేవలను అందుబాటులోకి రావాలంటే 400ల పాసులను తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. వెంటనే ఎంపీ రంజిత్ రెడ్డి తాను స్వయంగా విద్యార్థుల కోసం 100 పాసులకు అవసరమైన మొత్తం 2 లక్షల 40 వేల రూపాయలను ఇస్తానని హామీ ఇచ్చారు. ఫలితంగా ఈ నెల 9 నుంచి మర్పల్లి రైల్వే స్టేషన్ లో
ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి స్థానిక బీ ఆర్ ఎస్ నేతలు, మర్పల్లి జెడ్ పి టి సి మధుకర్, శ్రీకాంత్ గౌడ్ లకు రెండు లక్షల నలభై వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్ పి టి సి మధుకర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం పెద్ద మనస్సుతో వంద మంది విద్యార్థులకు రెండున్నర లక్షల రూపాయలను సాయం చెయ్యడం సంతోషదాయకమన్నారు. ఆయనకు మర్పల్లి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కై ఎంపీ రంజిత్ రెడ్డి సేవలను వినియోగించుకుని, భవిష్యత్ లో గొప్ప విజయాలు సాధించాలని కాంక్షించారు.