నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యోగ నిమిత్తం వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు.. శేరిలింగంపల్లిలోని ఖాజాగూడలో సహదేవ్ అపార్ట్ మెంట్ లో డి. ప్రశాంతి(17) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నది. అనాజా ఎఫ్ స్టూడియోలో ఉద్యోగం చేస్తున్నది. అయితే ఎప్పటిలాగే నిన్న 17న ఉదయం 10.30 గంటలకు ఉద్యోగానికి వెళ్లింది. కానీ సాయంత్రమైన తిరిగిరాకపోవడంతో తన తల్లి ధోని మేరీ (40) ప్రశాంతి కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. వెంటనే పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రశాంతి ఇంటినుంచి వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ పంజాబీ డ్రెస్ మరియు బ్లూ కలర్ స్కార్ఫ్ ధరించిందని, 5 అడుగుల ఎత్తు, బ్రౌన్ కలర్ లో ఉంటుందని తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే రాయదుర్గం పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని లేదా (8712663122) నెంబర్ సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
