సోమవారం ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించలేకపోయారా ? గురుబు, శని గ్రహాలు అత్యంత సమీపంలోకి వచ్చినా చూడలేదా ? అయినా విచారించాల్సిన పనిలేదు. ఎందుకంటే జనవరి 7వ తేదీ వరకు రోజూ రాత్రి పూట వాటిని చూడవచ్చు. పశ్చిమ దిశగా నిత్యం సాయంత్రం 6.30 గంటలకు ఆ రెండు గ్రహాలు నక్షత్రాల్లా కనిపిస్తాయి. కానీ నక్షత్రాల్లా మిణుకు మిణుకుమనవు. అవి ఆ సమయానికి 10 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు కనిపిస్తాయి. కనుక ఆ గ్రహాలను ముందు తెలిపిన తేదీ వరకు రోజూ వీక్షించవచ్చు.