శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ విద్యుత్ ఆపరేషన్స్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. పాపిరెడ్డి కాలనీ సబ్ స్టేషన్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, దూబే కాలనీ, పాపిరెడ్డి స్ప్రింగ్ వాల్యూ, పాపిరెడ్డి స్టేషన్ రోడ్డు, ఆదర్శ్ నగర్, నెహ్రూ నగర్, గోపీ నగర్, లింగంపల్లి స్టేషన్ రోడ్ నం.3,4 లలో కరెంటు ఉండదని తెలిపారు.