నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రౌండ్ కు 14 వేల ఓట్లను లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రక్రియ అంతా రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో అత్యధికంగా ఈ డివిజన్ నుండి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పోటీలో ఉండగా, బిజెపి నుండి కర్చర్ల ఎల్లేష్ పోటీలో నిలిచాడు. కాంగ్రెస్ పార్టీ నుండి మడుపతి శివకుమార్, టీడీపీ నుండి ఏరువ సాంబశివ రావు, ఎంసిపిఐ యు నుండి మధుసూదన్, ఏఐఎఫ్ బి నుండి యాసీన్ బాషా, స్వతంత్ర అభ్యర్థులుగా గుంజి వాసు (పెన్ డ్రైవ్ ), నల్లగంటి మల్లేశం(కత్తెర), ఎం.ప్రేమ్ కుమార్(ఆపిల్), బి.విజయలక్ష్మి (టార్చ్ ), కె.శ్రీనివాస్(బకెట్), డి.సతీష్ కుమార్(ఎన్వలప్), శ్యామ్యూల్ (క్యారం బోర్డు) లు బ్యాలెట్ పై నిలువనున్నారు. ఈ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్లు తెరాసకి 5, బీజేపీకి 4 వచ్చాయి.
తొలి రౌండ్ ముగిసే సరికి ఎన్నికల ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.
టీఆరెఎస్ –7055
బిజెపి -5634
కాంగ్రెస్ -301
టీడీపీ -313
ఎంసిపిఐ(యు) -12
గుంజి వాసు -06
నల్లగంటి మల్లేశం -04
ఎం.ప్రేమ్ కుమార్ -17
బి.విజయలక్ష్మి -22
కె.శ్రీనివాస్ -03
డి.సతీష్ కుమార్ -105
శ్యామ్యూల్ -27
NOTA-145
INVALID-347
మెజారిటీ – TRS 1421