మియాపూర్(నమస్తే తెలంగాణ): మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మంజూరి అయిన పనులను షార్ట్ టెండర్లు పిలిచి వెంటనే చేపట్టాలని కోరారు. అదేవిధంగా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని తెలియచేసారు. బల్దియా ,వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలనీ, ఎక్కడ సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చూడలని ,వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని, వర్షకాలంలో అధికారులంతా అప్రమత్రంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, డ్రైనేజి కి సంబంధించిన సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో డ్రైనేజి సమస్య పై తీసుకోవాల్సిన చర్యలు మరియు విధి విధానాల పై చర్చించారు. ఈ కార్యక్రమం లో అధికారులు జీఎం రాజశేఖర్ ,డిజిఎం నాగప్రియ,డిజిఎం నారాయణ మేనేజర్లు సుబ్రమణ్య రాజు,వెంకట్ రెడ్డి, నివర్తి తదితరులు పాల్గొన్నారు.