మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ లు శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అసోసియేషన్ సభ్యులు పెద్ద మధుసూదన్ రెడ్డి, పరమేశ్వర్ రావు, చిన్న మధుసూదన్ రెడ్డి, కెవి రావు, వాసు, విద్యా సాగర్ పాల్గొన్నారు.








