మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి: కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నామ‌ని కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. శ‌నివారం హ‌ఫీజ్‌పేట‌ డివిజ‌న్ ప‌రిధిలోని ఉషోదయా ఎన్‌క్లేవ్,హెచ్ఐజి ఫేజ్ 2, మైత్రి నగర్ ఫేజ్3 ప్రాంతాల్లో ఆయ‌న పాద‌యాత్ర నిర్వ‌హించారు. స్థానికంగా నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించే విధంగా నూతన పైప్ లైన్ నిర్మించాలని, పార్క్ అభివృద్ధి చేపట్టాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల‌కు త్వరలోనే పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పి.నాగేశ్వర్ రావు, మైత్రి నగర్ ఫేజ్ 3 అధ్యక్షుడు దయానంద రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్. పూర్ణచందర్ రావు, ట్రెజరర్ డి.నాగేశ్వర్, సెక్రటరీ డి.నర్సింహ గౌడ్, సభ్యులు శ్రీహరి రావు, సత్తి రాజు, ఆదిశేషు, విజయ్ కుమార్, బద్దరి నారాయణ రావు, చౌదరి, ఎలయ్య, రామ్మూర్తి, రామ్ నర్సయ్య, డివిజన్ నాయకులు ప్రవీణ్, చిన్నా, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

యూజీడీ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
స్థానికుల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here