మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా సందడిగా కొనసాగుతోంది. ఈ మేళా గురువారంతో ముగియనుండడంతో సందర్శకులు శిల్పారామంలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా శిల్పారామంలో మేళాలో భాగంగా మొత్తం 400 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా వాటిల్లో పలు రాష్ట్రాలకు చెందిన వస్తువులు, చేనేత, చేతి వృత్తుల కళాకారుల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.



కాగా బుధవారం సాయంత్రం శిల్పారామంలోని ఆంఫి థియేటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఎస్ఎల్ ప్రవీణ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరించింది.






