చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కూలి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని అపర్ణ సిటిజెన్ హాస్పిటల్ సమీపంలో ఎం.ఏసు తన భార్య లక్ష్మి (32), ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు లక్ష్మి కూలి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త ఏసు అన్ని చోట్లా ఆమె కోసం వెదికాడు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.