హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్లు ఆదివారం పర్యటించారు. కాలనీలో పాత పైప్ లైన్ రెండు ఇళ్ల మధ్యలో ఉందని, దీంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా వారు సమస్యను పరిశీలించారు. హుడా కాలనీలో 80 శాతం నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. త్వరలో నూతన పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోసిన్, ఎం.ఎస్ రాజు, అమీనుద్దీన్, భాస్కర్, గోవర్ధన్, ప్రభాకర్ పాల్గొన్నారు.






